శ్రీశైలం మార్కాపురం జిల్లాలో కలపాలని వస్తున్న డిమాండ్ పై ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి స్పందించారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియాతో మాట్లాడిన మంత్రి స్వామి ఇది రెండు జిల్లాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉందని అన్నారు. ఇప్పటికే ఉప సంఘం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసేందుకు కార్యక్రమం చేపట్టిందని అతి త్వరలో ఏది ఎక్కడ ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. శ్రీశైలం నంద్యాల జిల్లాలోని ఉంటుందని మంత్రి స్వామి ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.