అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సంబేపల్లి వద్ద రోడ్డుపై ఆగి ఉన్న లారిని ఢీకొట్టి ఓ వ్యక్తి అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు. బుధవారం వేకువ జామున జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. రాయచోటి మార్గంలోని సంబేపల్లి మండలం, గుట్టపల్లి వద్ద షీట్స్ లోడ్ తో వెళుతున్న ఐషర్ లారీ డ్రైవర్ కౌసిఫ్ అహ్మద్ కు ఫిట్స్ రావడంతో లారీ రోడ్డు పైనే ఆగి పోయింది. అదే సమయంలో కలకడ మండలం, బాటవారి పల్లెకు చెందిన చేపల వేటకు వెళుతున్న జాలరి చల్లా రామాంజులు (52) నిలచిన లారిని గమనించకుండా వెళ్లి ఢీకొని అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహానికి పంచిన మన నిర్వహించి పోస్టుమార్టం