కంచికచర్ల మండలం పరిటాల వద్ద హైవేపై నిమజ్జనం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిమజ్జన ఊరేగింపులో నిర్వాహకులకు, స్థానికులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో నలుగురికి గాయాలయ్యాయి. దీనికి నిరసనగా నిర్వాహకులు పరిటాల రహదారిపై బైఠాయించారు. శనివారం దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.