Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 29, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, సోమశిల జలాశయం తాజా నీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి 19, 496 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు ఈఈ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. పూర్తి సామర్థ్యం 78 TMCలు కాగా 60.050 TMCల నీటిమట్టం నమోదైంది. రైతుల అవసరాల కోసం పెన్నా డెల్టాకు 1,850, కండలేరుకు 10, 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 265 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.