గాజులదిన్నె ప్రాజెక్టు గేట్ల ద్వారా వరద నీటిని శుక్రవారం రాత్రి దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం కోడుమూరు పట్టణ ప్రజలు స్థానిక హంద్రీ నదిలో వరద చూడడానికి సమయం కేటాయించారు. పత్తికొండ రహదారిలో హంద్రీ వంతెనపై నుంచి వరద నీటిని తిలకించారు. మరికొందరు పాత వంతెన పైకి చేరి సరదాగా గడుపుతూ సందడి చేశారు.