జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఎటువంటి ఆ వాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల గురించి, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ పేర్కొన్నారు .గురువారం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశాలను సంబంధిత జోనల్ డిఎస్పీలు, ఇన్స్పెక్టర్ల తో కలిసి పరిశీలించారు. ఈయన వెంట అడిషనల్ ఎస్పీ(లా అండ్ ఆర్డర్) ఏ వి సుబ్బరాజు మరియు అడిషనల్ ఎస్పి( ఏఆర్) ఎల్. చెంచి రెడ్డి పాల్గొన్నారు.