అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం లోని తాడిపత్రి పట్టణంలో వినాయక నిమజ్జనంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తాడిపత్రి పట్టణంలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత జేఏసీ కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య రాళ్లతో దాడులు జరుపుకున్నారు. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మొహరించిన వారి ముందే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ ఘర్షణ వాతావరణం నెలకొంది.