మోరంపూడి ప్రైవేటు స్కూల్ హాస్టల్ లో 10వ తరగతి చదువుతున్న మలికిపురం మండలం, శంకరగుప్తం కు చెందిన విన్సెంట్ ప్రసాద్ (16) పై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఐరన్ బాక్సుతో పొట్ట, చేతులపై వాతలు పెట్టారు. తన బిడ్డను చూసేందుకు తల్లి లక్ష్మీ కుమారి స్కూల్ కి వెళ్లడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. విద్యార్థి ని ఇంటికి తీసుకు వచ్చిన తల్లి రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.