యాడికి మండల వ్యాప్తంగా బుధవారం వినాయక పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్యలు భక్తులకు దర్శనమిచ్చారు. యాడికి మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా సుమారు నూరు దాకా గణనాథులను ప్రతిష్టించినట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు వినాయక మండపాల వద్ద పూజలు నిర్వహించారు. వినాయక మండపాల వద్ద సందడి, కొలాహలం నెలకొంది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.