హయత్ నగర్ లో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగి దండాలు పెట్టే రోజుల్లో శివంగిలా గర్జించి తెలంగాణ సాయుధ రైతంగ పోరాటాన్ని ముందుండి దొరలను గడగడలాడించి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఎదిరించి కొట్లాడిన వీర వనిత మన చాకలి ఐలమ్మ అని ఆమె ధీరత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని కార్పొరేటర్ అన్నారు.