పుట్టపర్తి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆధ్వర్యంలో యూరియా లభ్యత, వినియోగంపై శుక్రవారం మధ్యాహ్నం సమీక్ష జరిగింది. రైతులకు సమయానికి యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని, పంపిణీపై ప్రైవేట్, ప్రభుత్వ శాఖల వద్ద నిఘా పెంచాలని సూచించారు. డిమాండ్-సప్లై వివరాలను ప్రతిరోజూ నమోదు చేసి IFMS పోర్టల్ లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.