మెదక్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి నీలిమ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం కోర్ట్ ఆవరణలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన కార్యదర్శి ఆర్ఎం సుభవల్లి విలేకరుల సమావేశంలో జాతీయ లోక్ అదాలత్ కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీ శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని కక్షిదారులు ఎక్కువ మొత్తంలో కేసులు పరిష్కరించి సద్వినియోగం చేసుకోవాలన్నారు రాజీయే రాజమార్గమని ఇరువర్గాలు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు అందరికీ న్యాయం అందుబాటులో