రాజాం పట్టణంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆర్సిఎం సెర్చ్ పాదర్ విజయరెడ్డి ఆధ్వర్యంలో ఏసు శిలువ మార్గం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యందవ రమేష్ ఏసుశీలవను మోసి, బాధించబడిన దృశ్యాలను ప్రదర్శించారు. అలాగే పలువురు స్థానికులు పలు వేషధారణలతో అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అలాగే మండల వ్యాప్తంగా స్థానిక చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.