తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మైనార్టీలను మోసం చేస్తుందని టిఆర్ఎస్ పార్టీ వికారాబాద్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ గయాజ్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి, వారు మాట్లాడుతూ రంజాన్ వేడుకలకు రంజాన్ తోఫాలను ఇవ్వడంలేదని ఈద్గాలకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని గ్రామాలలో మైనార్టీలను పట్టించుకోవడంలేదని అన్నారు.