ఏలూరు పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ధర్నా నిర్వహించారు.. ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి భారత పర్యటనను వ్యతిరేకిస్తూ గో బ్యాక్ అంటూ సీపీఐ (ఎంఎల్) నాయకులు నినాదాలు చేశారు. గాజాలో తక్షణ శాశ్వత కాల్పుల విరమణ జరగాలన్నారు. భారత ప్రభుత్వం ఇజ్రాయిల్తో ఉన్న సంబంధాలను తగ్గించాలన్నారు. గాజా హింసకు కారణమైన ఇజ్రాయిల్ ప్రధానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.