ఇందిరమ్మ ఇళ్ల గ్రామ కమిటీని వెంటనే రద్దు చేయాలి.సిపిఎం పార్టీ డివిజన్ నాయకులు పాపినేని రామ నరసయ్య,రాయపట్నం గ్రామంలో అర్హులందరికీ ఇల్లు రాలేదని, ఇందిరమ్మ కమిటీలు వెంటనే రద్దు చేయాలని సిపిఎం డివిజన్ నాయకులు పాపినేని రామ నర్సయ్య అన్నారు. బుధవారం రాయపట్నం గ్రామస్తులు తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయపట్నం గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదని, అర్హత లేని వారికి ఇల్లు కేటాయించారని, అర్హత లేనివారిండ్లను రద్దు చేయాలని, దళితవాడపై వచ్చే వరద నీటి ప్రవాహాన్ని దారి మళ్ళించాలి,అన్నారు