అల్లూరి జిల్లాలో సోమవారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కూనవరం మండలం రేపాక – భగవాన్ పురం ప్రధాన రహదారిపై సోమవారం సాయంత్రం ఎదురెదురుగా వెళ్తున్న స్కూటీ, హీరో బైక్ ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించగా, రేగులపాడుకి చెందిన తిమ్మా నాగిరెడ్డి మృతి చెందగా, కూటురు గ్రామానికి చెందిన పాయం అరవింద్, పాయం వివేక్ లకు తీవ్రగాయాలతో చికిత్సి పొందుతున్నారు. రాజవొమ్మంగి మండలం కిండ్ర జంక్షన్ వద్ద జరిగిన ఆటోల ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అయ్యాయి.