సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ అన్నపూర్ణఆదేశాల మేరకు గంట్యాడ ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు వసతి గృహ సంక్షేమ అధికారి గొర్లె గోవింద సన్యాసిరావు ఆధ్వర్యంలో సబ్జెక్టుల వారీగా క్విజ్ పోటీలను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. 9, 10 తరగతి ల విద్యార్థులను గ్రూపుల వారీగా విభజించి సబ్జెక్టుల వారీగా క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ డబ్ల్యు ఓ గోవింద సన్యాసిరావు మాట్లాడుతూ, ఎస్సీ వసతి గృహ విద్యార్థుల విద్యా ప్రమాణాల స్థాయిని పెంచేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రతినెల క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.