Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండలం, దువ్వూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ సీఐ వాహనం ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల మేరకు... సంఘం మండలం దువ్వూరు వద్ద అతివేగంతో వెళ్తున్న ఎక్సైజ్ సీఐ ఎంవి రమణమ్మ కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే ఎక్సైజ్ సీఐ వాహనంలోని సీఐ రమణమ్మతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు