నేర పరిశోధన మరింత వేగవంతం చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక డ్రోన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కొవ్వూరు డి.ఎస్.పి దేవకుమార్ అన్నారు. శనివారం తాళ్లపూడి పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం కొవ్వూరు రూరల్ పరిధిలో ఒక డ్రోన్ ఉందని తెలిపారు. ప్రజల సహకారంతో మరియు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ కు ఒక డ్రోన్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.