అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న మేల్ మెడిసిన్ వార్డు నుంచి రాయదుర్గం కు చెందిన నాగరాజు అనే రోగి అదృశ్యమైనట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రమైన జ్వరం రావడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అతను బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.