పలాస నియోజకవర్గ వజ్రపుకొత్తూరు మండల శివారు రైతులకు వంశధార సాగునీరు వెళ్లేందుకు కాశీబుగ్గ ఎల్సి గేట్ సమీపంలో రైల్వే కల్వర్టు వద్ద జంట పట్టణాల నుంచి వచ్చిన మురుగనీరుతో ప్లాస్టిక్ వ్యర్ధాలు చెత్త పేరుకుపోయింది. విషయం తెలుసుకున్న Ae రాజశేఖర్, ee శేఖర్ dc అధ్యక్షులు నిరంజన్ ఘటన స్థలానికి చేరుకొని రైతుల సహాయంతో మురుగు నీటిలో ఉన్న వ్యర్ధాలను అతి కష్టంగా తొలగించారు. ఈ సందర్భంగా డిసి నిరంజన్ మాట్లాడుతూ... మున్సిపల్ అధికారులు స్పందించి ప్రతినెల కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి రైతులకు సాగునీరు అందించాలని కోరారు.