కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని పెండ్లిమర్రి మండలం మమ్ము సిద్ధుపల్లె రైతు చంద్రశేఖర్ రెడ్డి పిల్లలే కాడి ఎద్దులయ్యారు. శనివారం తెల్సిన వివరాల మేరకు పెండ్లిమర్రి మండలం మమ్ము సిద్ధుపల్లెకు చెందిన రైతు చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందుల కారణంగా తీవ్ర కష్టాల్లో ఉన్నాడు. తన మూడు ఎకరాల చామంతి పూల తోటలో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగడంతో, వాటిని తొలగించేందుకు కూలీలను పని చేయాల్సివుంది. అయితే కూలీలకు డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉండటంతో, అతని పిల్లలు - కొడుకు, కూతురు - కూలీలా కాకుండా కాడి ఎద్దులుగా పనిచేయించాల్సి వచ్చిందని రైతు తెలిపారు.