అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయంలో కొలువుదీరిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనను వేదమంత్రాలతో ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.