నేర నియంత్రణ,చట్టవ్యతిరేక కార్యాకలపాలు అరికట్టే చర్యలు లో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ వారి ఆదేశాలు మేరకు శనివారం ఉదయం శ్రీకాకుళం రూరల్, టెక్కలి, వజ్రపు కొత్తూరు, మెలియపుట్టి తదితర పోలీసు స్టేషన్లు పరిధిలో పోలీసులు పలు గ్రామాల్లో, వార్డుల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గంజాయి వంటి మత్తు పదార్థాలు నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యాకలపాలు నివారణకు కార్డన్ సెర్చ్ నిర్వహించి,అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు.కొత్త వ్యక్తులు, అనుమానస్పద వ్యక్తులు వివరాలపై ఆరాతీసి గంజాయి,మద్యం,నాటు సారా, నాటు తుపాకీలుఉండడం నేరమన్నారు.