ఆధునిక సాంకేతిక యుగంలో నిత్యం డబ్బుల వేటలో, మానవత విలువలు తగ్గిపోతున్నాయి. ఈ తరణంలోనే కొంత మంది మూగ జీవాలపై చూపిస్తున్న మమకారంతో ఎక్కడో ఓ చోటా, ఇంకా మానవత్వం బ్రతికే ఉందని తెలుస్తుంది. నిన్న జగిత్యాల జిల్లాలో ఓ టిచర్ కుటుంబం పుట్టిన పక్షి పిల్లలకు బారసాల చేయగా, నేడు పెద్దపల్లి జిల్లాలో ఓ కోతికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు అక్కడి గ్రామస్తులు. ఈ సంఘటన పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఓ వానరం ప్రమాదవశాత్తు మృతి చెందడంతో గ్రామస్తులు కోతి శవంపై పూలమాలవేసి, జై శ్రీరామ్ అని నినాదాలతో అంత్యక్రియలు జరిపారు.