చమురు సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. యానాం లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ అర్ధరాత్రి గ్యాస్ పైప్ లైన్ నుండి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చేల రేగి తీవ్ర నష్టం జరిగిందని సముద్రపు నీటిలో చేపలు చనిపోయి తేలుతున్నాయని వాపోయారు. సమావేశంలో పాల్గొన్న యానాం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ సంఘటనపై కాకినాడ కలెక్టర్ ను కలవనున్నట్లు తెలిపారు