కాట్రావులపల్లి గ్రామం శివారులో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 వేల 400 రూపాయలు నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయటం జరిగింది అని సిఐ తెలిపారు. అంతేకాకుండా ఎటువంటి గుండాటలు, పేకాటలు, కోడిపందాలు, ఎత్తులాట, బొమ్మ బొరుసు, క్రికెట్ బెట్టింగ్ లు, కోతబంతి లాంటి జూద క్రీడలు ఆడిన ప్రోత్సహించిన కఠిన చర్యలు తప్పవని సీఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.