Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
మాదకద్రవ్యాలను తరిమికొట్టి యువతను కాపాడుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సీతానగరం మండలంలోని జోగంపేటలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, శక్తి యాప్, ఈవ్ టీజింగ్, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలు తదితరు వాటిపై అవగాహన కల్పించారు. మహిళ రక్షణ చట్టాలు, పొక్సో యాక్ట్ తదితర వాటిపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్పీ అంకిత సురాన తదితరులు పాల్గొన్నారు.