భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు భవనముల సముదాయంలో నూతనంగా రాబోయే అదనపు జిల్లా కోర్టులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ బుధవారం భూమిపుజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టులు కొత్తగూడెం లో అందుబాటులోకి వస్తున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు గొల్లపూడి భానుమతి, బత్తుల రామారావు, ఏ. సుచరిత, పి సాయి శ్రీ,వి శివ నాయక్, కొత్తగూడెం భార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ , తదితరులు పాల్గొన్నారు