చిన్నమండెం మండలం దేవళంపేట అడవిలో 45ఏళ్ల మహిళ మృతదేహం లభించిన ఘటనపై అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. విచారణలో ఇది హత్యకేసుగా తేలింది. మదనపల్లి మండలం సవరంవారిపల్లికి చెందిన శ్రీదేవి, గురిగింజకుంట శివప్రసాద్ నాయుడితో వివాహేతర సంబంధంలో ఉండగా, ఆమెతో గొడవ పడిన నిందితుడు శివప్రసాద్ ఆమెను చీరతో గొంతు నులించి హత్య చేసి, చంపి మృతదేహాన్ని నిప్పు పెట్టి పారిపోయినట్లు గుర్తించారు. ఈనెల 24న శివప్రసాద్ నాయుడు అదుపులోకి తీసుకోబడ్డాడు.