నంద్యాల జిల్లా బేతంచర్ల మండల కేంద్ర గణేష్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో ఆయా మండప గణేష్ నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు గౌరు హుస్సేన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చారు. 27వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. డీజేలకు ఎలాంటి అవకాశం లేదని మరొకసారి స్పష్టం చేశారు.