లారీ,బైక్ డీ..ఇద్దరికి తీవ్ర గాయాలు,ఒకరి పరిస్థితి విషమం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వివరాలలోకి వెళితే బుధవారం రాత్రి సమయంలో లారీ, బైక్ ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు అంబులెన్స్లో క్షతగాత్రులను కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బెజ్జంకి మల్లేష్కు తీవ్ర గాయాలు కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో వ్యక్తి బెజ్జంకి సురేష్కు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.