ఆదిలాబాద్ లోని ప్రైవేటు ఫర్టిలైజర్స్ షాప్ ముందు యూరియా కోసం రైతులు శుక్రవారం క్యూ కట్టారు. మార్కెట్లో యూరియా కొరత ఉందని ఉదంతులు రావడంతో రైతులు బారులు తీరారు. జిల్లాలో యూరియా బ్యాగులు సరిపడా ఉన్నాయని అందరికీ బస్తాలు అందిస్తామని ఆదిలాబాద్ అర్బన్ అగ్రికల్చర్ ఆఫీసర్ నగేశ్ రెడ్డి తెలిపారు. పట్టా పాస్ బుక్ వెరిఫికేషన్, ఫింగర్ ప్రింట్ విధానం వల్లే క్యూ లైన్ ఏర్పడిందన్నారు.