షాద్నగర్ పోలీస్ స్టేషన్ లో సిఐ విజయ్ కుమార్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. జులై 11న ఇందిరా కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు బైక్ దొంగతనం అయినట్లు పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు దర్యాప్తు చేయగా శివ రామచంద్రులను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ విజయ్ కుమార్ తెలిపారు.