మంగళవారం మధ్యాహ్నం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన గ్రామ పాలనాధికారుల కౌన్సిలింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ పాలన అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థి సొంత నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో మెరిట్ ప్రకారం ఎంచుకున్న గ్రామాలకు నియమించడం జరుగుతుందన్నారు.