విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతం ఆకతాయిలకు అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా ఎంకే బేగ్ మున్సిపల్ హైస్కూల్, వివేకానంద సెంటెనరీ హైస్కూల్, లూనా సెంటర్లోని అంబేద్కర్ గ్రౌండ్ ప్రాంతాల్లో ఆకతాయిలు నిత్యం రోడ్లపై వెకిలి చేష్టలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.