అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయ సన్నిధిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు గురువారం స్వామివారిని మూషిక వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళా తాళాలు మంగళ వాయిద్యాల నడుమ మూషిక వాహనంపై స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు