ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం ప్రభుత్వ పాఠశాలలో ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలలో లక్కవరం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు నాగరాజును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగా పరిరక్షణ, నాణ్యమైన విద్య కోసం నిరంతరం పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ సభ్యులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయనీలు తదితరులు పాల్గొన్నారు.