అమలాపురం నియోజకవర్గ వైసీపీ పార్టీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ అధ్యక్షతన అమలాపురం లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ రావు, బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడారు. రైతులకు సంక్షేమం కోరుతూ ఈనెల తొమ్మిదో తేదీన ప్రతి నియోజకవర్గం లో నిర్వహించే కార్యక్రమానికి మద్దతుగా పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.