అల్లూరి జిల్లా పాడేరు మండలం అరకు పుట్టు వద్ద శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అనకాపల్లి సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో మూడు కేజీల 63 గ్రాముల లిక్విడ్ గంజాయితో జిమాడుగుల మండలం అలగం గ్రామానికి చెందిన వండలం చిన్న బాలన్న అదుపులోకి తీసుకోగా అదే గ్రామానికి చెందిన వండలం కృష్ణారావు పరారీ అయ్యారని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై సురేష్ తెలిపారు. పట్టుకున్న గంజాయితోపాటు నిందితుడిని పాడేరు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కి అప్పగించామని వెల్లడించారు.