పెడనలో కుక్కల మృతి కలకలం పెడనలో సుమారు 15 కుక్కలను చంపి మున్సిపల్ వాహనంలో తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న జంతు ప్రేమికుడు వీర వెంకటరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని, కుక్కల కళేబరాలను పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. నిందితులు పెడనకు చెందిన వారు కాదని, వారికి మున్సిపల్ వాహనం ఎలా వచ్చిందనే వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.