వికారాబాద్ జిల్లా గుండా పూడూరు మండల పరిధిలో పలు గ్రామాల గుండా వెళ్తున్న త్రిబుల్ ఆర్ రోడ్డుపై రోజుకు ఒక ధర్నాలతో జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు దదరిల్లుతున్నాయి. పాత అలైన్మెంట్ ప్రకారమే భూసేకరణ జరిపి చిన్న సన్న కారు రైతులకు నష్టపోయే విధంగా త్రిబుల్ ఆర్ రోడ్డు ఉండకుండా చేయాలని, కొత్త అలైన్మెంట్ ప్రకారం భూసేకరణ చేస్తే చిన్న సన్నకారు రైతులు నష్టపోతారని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పూడూరు మండల రైతులు ధర్నా నిర్వహించారు.