ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని షిరిడి సాయి నగర్ లో దొంగలు రెచ్చిపోయారు. భాస్కర్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో ఎవరు లేని సమయాన్ని చూసి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువాను పగలగొట్టారు. అందులో ఉన్న 2 తులల బంగారం,10 తులాల వెండి రూ.15 వేలు నగదును దొంగలు అపహరించారు. భాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనులపై అర్ధవీడుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారని తెలిపాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగల వేలిముద్రలు సేకరిస్తున్నామని దొంగలను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని పోలీసులు సోమవారం ఉదయం 11 గంటలకు తెలిపారు.