ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని మాధవరం విఠలాపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. రైతులకు పాడిపంట రెండు కండ్లు లాంటివిని వ్యవసాయ పశుసంవర్ధక శాఖలు రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండి రైతులకు సహకరిస్తున్నట్లు ఏవో తెలిపారు. రెండు గ్రామాలలో 200 షెడ్లు ఉన్నాయని ఒక్కో షెడ్డులో 20 నుంచి 470 పశువులు ఉన్నాయని వెల్లడించారు. మండలంలో 12256 ఎకరాల పశుగ్రాసం సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు.