జిల్లాలోని గిరిజన గ్రామాలు మరియు తండాలలో అవసరమైన పలు అభివృద్ధి పనులు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల భవనాలు, అంగన్వాడీ సెంటర్లు, గ్రామపంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, వాటర్ ట్యాంకులు వంటి సౌకర్యాలను గుర్తించి, అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజన గ్రామాలలో వివిధ అభివృద్ధి పనుల కొరకు అంచనాలను తయారు చేయడానికి గాను జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ మరియు నాయకపు గూడెం గ్రామాలలో పలు అభివృద్ధి పనుల కొరకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్...