విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని చెప్పాలని విశాఖ పర్యటనకు వస్తున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ను పీసీసీ సభ్యుడు మువ్వల శ్రీనివాసరావు కోరారు. బొబ్బిలి కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కూటమిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.