Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 7, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండల మాజీ ZPTC షేక్ సల్మా షిరీనన్ను ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమించారు. ఈ సందర్భంగా ఆమె విజయవాడ క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. జీవితాంతం ఆనం వెంట నడుస్తామని, మంత్రికి స్వీట్స్ తినిపించి ధన్య వాదాలు తెలియజేశారు. మండల అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్, చేజర్ల మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.