కల్లూరు మండలం ఏ.గోకులపాడులో సోమవారం నిర్వహించిన సంచార చికిత్స శిబిరాన్ని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ రఘు పరిశీలించారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేస్తున్నారు. కౌమారదశ బాలబాలికలకు వైద్య పరీక్షలతో పాటు ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేస్తున్న సంచార చికిత్సను సద్వినియోగం చేసుకోవాలన్నారు.