ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన పెండం జనార్దన్ మృతి చెందడంతో వారి పేరు మీద గల 222 సర్వే నంబర్లో ఉన్న 48 గుంటల భూమిని వారి కూతురు వరలక్ష్మికి తెలియకుండా వారసత్వం సర్టిఫికెట్ తీసి కొడుకుల పేరుమీద తహిసీల్దార్ సుజాత రెడ్డి ,RI పట్ట మార్పిడి చేశారని ఆరోపిస్తూ వారిని వెంటనే సస్పెండ్ చేయాలని శనివారం తహసిల్దార్ కార్యాలయం వద్ద తాసిల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ బాధిత కుటుంబం నిరసన వ్యక్తం చేశారు. తనకు ఏలాంటి సమాచారం ఇవ్వకుండ ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.